వికసిత్ భారత్ ప్రధాని ధ్యేయం..

21-09-2026 | 08:17pm

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  రామచందర్ రావు..

యాదగిరిగుట్టలో రక్త దాన శిబిరంలో పాల్గొన్న రామచందర్ రావు..

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిగా, ప్రధానిగా 25 సంవత్సరాలు ప్రజా జీవితంలో పేద ప్రజలకు సేవలను అందిస్తున్నారని భారతదేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు(BJP State President Ramchander Rao) అన్నారు. సోమవారం యాదగిరిగుట్టలో బిజెపి, యువమోర్చా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు  పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలు సెప్టెంబర్ 17 నుండి నెల రోజులపాటు జరిపేందుకు బిజెపి యువమోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఇప్పటివరకు 25వేల మంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని అన్నారు. బిజెపి యువ మోర్చాతో పాటు ప్రజలు కూడా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జన్ ధన్ యోజన, గరీబ్ కళ్యాణి యోజన, కిసాన్ సమ్మేళనంతో పాటు అనేక పథకాలను పేద మధ్యతరగతికి అందే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని అన్నారు. 

మరిన్ని వార్తలు