విద్యుత్తు ఘాతం ఘటనపై రామగుండం ఏడీఈ విచారణ
రామగిరి,(విజయ క్రాంతి): రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలోని 33/11 కెవి సబ్ స్టేషన్ కార్యాలయంలో సోమవారం రామగుండం ఏడిఈ రమేష్ విచారణ నిర్వహించారు. జూన్ 30వ తేదీన వీధి దీపాలు బిగిస్తుండగా గ్రామానికి చెందిన విద్యుత్ హెల్పర్ మెట్టు రవి విద్యుత్ ఘాతానికి గురై కిందపడి తీవ్రమైన గాయాల పాలయ్యాడు. ఈ క్రమంలో ఇప్పటికే ఏ ఎల్ ఎం తిప్పిరి శెట్టి రమేష్ పై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిన విషయం విధితమే. దీనికి తోడు గ్రామస్తులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, రవి కుటుంబ సభ్యులు మంథని డి ఈ వెగ్గాలం ప్రభాకర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సంఘటనకు కారణం స్థానిక ఏఎల్ఎం రమేష్ కారణమని ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులందరూ సబ్ స్టేషన్ కు తరలివచ్చారు. దీనికి తోడు ఈ సంఘటన జరిగిన విధానంపై ఫిర్యాదుదారులు, సాక్షులు అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. బాధితుడు రవి దగ్గర నుండి స్టేట్మెంట్ తీసుకున్నారు. రామగుండం ఏ.డీ.ఈ రమేష్ ముందు ఇచ్చిన వాంగ్మూలమును మంథని సబ్ ఇంజనీర్ వంశీ కృష్ణారెడ్డి లిఖితపూర్వకంగా రాసుకుని బాధితులు, సాక్షుల్ ల సంతకాలు సేకరించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు, కార్యదర్శి గంగుల సంతోష్, ఉపసర్పంచ్ భాద్రపు ప్రవళిక ప్రశాంత్, వార్డు సభ్యులు పబ్బ స్రవంతి వెంకటేష్, జక్కుల పద్మ చందన్, కలవేన రవి, బత్తిని ప్రశాంత్, అల్లి రమేష్, తన్నీరు ప్రదీప్, బీజేపీ మండలం అధ్యక్షుడు కొండూ లక్ష్మణ్, స్థానిక నాయకులు కొండూ అంజయ్య, పబ్బ మొగిలి, కండె కిష్టయ్య,బోగి సతీష్, సందవేన కుమార్, కొవ్వూరి సురేష్, సోమారపు కనకయ్య, భాద్రపు రంగయ్య, కేశవేన మల్లేష్, పానుగంటి వీరేశం,మెట్టు శ్రీశాంత్, మెట్టు నర్సింగం, మెట్టు వెంకటేశం,గ్రామ పంచాయతీ సిబ్బంది కొండ శంకర్, కండె సంజీవ్, బుత్కూరి శ్రీనివాస్, గాదె మొండయ్య పాల్గొన్నారు.
