మేడ్చల్ మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స
గైనకాలజిస్ట్ డాక్టర్ సోనియా రెడ్డి
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో మహిళకు అరుదైన శస్త్ర చికిత్స అందించామని గైనకాలజిస్ట్ డాక్టర్ సోనియా రెడ్డి(Gynecologist Dr. Sonia Reddy) చెప్పారు.ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ... మేడ్చల్ మున్సిపల్(Medchal Municipal) పట్టణంలోని మెడినోవా ఆసుపత్రిలో వైద్యుల సలహా మేరకు 58 సంవత్సరాల మహిళలో 6.2 కిలోల బారి అండాశయ కణితిని విజయవంతంగా తొలగించినట్లు ఆమే తెలిపారు.
మెదక్ జిల్లాలోని గాంధార పలికి చెందిన 58 సంవత్సరాల మహిళ గత 3 నెలలుగా కడుపు ఉబ్బరం, అజీర్ణంతో బాధపడుతూ మెడినోవా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి(Medinova Super Specialty Hospital) వైద్యులను సంప్రదించినట్లు డాక్టర్ సోనియా రెడ్డి చెప్పారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో సదరు రోగి పొత్తికడుపులో సుమారు 32×30 సెం.మీ. పరిమాణంలో అత్యంత బారి అండాశయ కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. తదుపరి నిర్వహించిన పరీక్షల్లో ఆ కణితి పొత్తికడుపు నుంచి పైభాగం వరకు విస్తరించి ఉండటంతో పాటు, పరిసర అవయవాలకు అంటుకొని ఉండటం కేసును అత్యంత క్లిష్టంగా మార్చిందని మెడినోవా ఆసుపత్రి వైద్యులు గుర్తించారు.
తర్వాత శస్త్ర చికిత్సకూన్ ముందు కార్డియాలజీ నిపుణులు నిర్వహించిన పరీక్షల్లో మైల్డ్ డయాస్టలిన్ డిస్ ఫంక్షన్,మైల్డ్ పల్మనరీ హైపర్ టెన్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.అనంతరం మెడినోవా ఆసుపత్రికి చెందిన గైనకాలజిస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా రెడ్డి,జనరల్ సర్జన్ డా.మనోజ్ కుమార్,అనస్తేషియా డా.మాధవ్ రెడ్డి,డాక్టర్ శిరీష లతో పాటు ఇతర వైద్యు బృందం సమన్వయంతో ఎక్స్ ప్లోరిటరీ లాపరోటమి ని నిర్వహించారు.అనంతరం రోగి కుటుంబ సభ్యులు మెడినోవా ఆసుపత్రి వైద్యులలకు ధన్యవాదాలు తెలియజేశారు.