దొడ్డు బియ్యం కిరికిరి
- 18 నెలలుగా రేషన్ డీలర్ల వద్ద నిలువలు
- 6 ఏ కింద కేసులు నమోదు చేస్తామంటున్న అధికారులు
- ఆందోళన చెందుతున్న రేషన్ డీలర్ లు
- ప్రభుత్వ నిర్లక్ష్యంతో తరుగు అంట కట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్న రేషన్ డీలర్లు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): దొడ్డు బియ్యం కిరికిరిపై ప్రభుత్వం ఎటు తేల్చడం లేదు. దీంతో రేషన్ డీలర్ లు ఆందోళన చెందుతున్నారు. గత 18 నెలలుగా రేషన్ డీలర్ల(Ration Dealers) వద్ద దొడ్డు బియ్యం స్టాక్ నెలకొంది. తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యంకు బదులుగా సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నడంతో దొడ్డు బియ్యం నిల్వలు రేషన్ షాపుల్లోనే నిల్వ ఉన్నాయి. దొడ్డు బియ్యం నిల్వలను 18 నెలలు అవుతున్న ప్రభుత్వం స్వాధీనం చేసుకోలేదు.
దీంతో కొంతమంది రేషన్ డీలర్లు దొడ్డు బియ్యాన్ని అమ్మేసుకున్నారు. మరికొందరు స్టాకు ఉంచారు. దొడ్డు బియ్యం అమ్ముకున్న రేషన్ డీలర్లకు డబ్బులు వచ్చాయి. డబ్బులను వివిధ రూపాల్లో చలమని చేసుకొని ఉన్న రేషన్ డీలర్లు ప్రభుత్వం దొడ్డు బియ్యం సంబంధించిన డబ్బులు చెల్లించి మంటే సిద్ధంగా ఉన్నామని దొడ్డు బియ్యం అమ్ముకున్న డీలర్లు సిద్ధంగా ఉండగా, ప్రభుత్వంతో కిరికిరి ఏమిటి అని భావించిన కొందరు డీలర్లు దొడ్డు బియ్యం నిల్వలను అలాగే ఉంచారు.
18 నెలలు అవుతున్న ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని తీసుకోకపోవడంతో బియ్యం షాటేజీ వస్తుంది. తిరిగి అదే ప్రమాణ స్థాయిలో అప్పగించాలంటే తాము నష్టపోతామని రేషన్ డీలర్లు అంటున్నారు. ప్రభుత్వం మాత్రం దొడ్డు బియ్యం అప్పగించని రేషన్ డీలర్ల పై 6 ఏ కింద కేసుల నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో దొడ్డు బియ్యం స్టాక్ లేని రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దొడ్డు బియ్యం స్టాకు పెట్టి ఉంచిన తరుగు వస్తుందని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా దొడ్డు బియ్యం నిల్వలను తమ నుంచి స్వాధీనం చేసుకోవాలని రేషన్ డీలర్లు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లాలో 761 రేషన్ డీలర్లు ఉన్నారు. వారి వద్ద దొడ్డు బియ్యం 15 వందల టన్నుల నిల్వలు ఉన్నాయి. కొంతమంది డీలర్లు దొడ్డు బియ్యాన్ని అమ్ముకున్నారు. మరికొందరు నిలువలు ఉంచారు.
దొడ్డు బియ్యం స్వాధీనం చేసుకోవాలి
రేషన్ డీలర్ల వద్ద ఉన్న దొడ్డు బియ్యం స్టాకును ఇప్పటికైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కొంతమంది రేషన్ డీలర్లు కోరుతున్నారు. కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వారు తెలిపారు. సివిల్ సప్లై అధికారులకు విన్నవించినట్లు తెలిపారు. దొడ్డిబియ్యం స్టాక్ తమ వద్ద నుంచి గత 18 నెలలుగా తరుగును తీసి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. 18 నెలల కింద ఉన్న దొడ్డు బియ్యం బరువును తాము ఇప్పుడు చెల్లించలేమని తాము తీవ్రంగా నష్టపోతామని రేషన్ డీలర్లు అంటున్నారు.
దొడ్డు బియ్యం అమ్ముకున్న డీలర్లపై 6ఏ కేస్‌లు
గత 18 నెలల క్రితం దొడ్డు బియ్యం స్టాక్ ఉన్న రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యం అప్పగించకుంటే వారిపై 6 ఏ కింద కేసులు నమోదు చేస్తాం. ప్రభుత్వం డీలర్లకు పంపిణీ చేసినప్పుడు ఎంత వెయిటేజ్ విలువ గల బియ్యం ఇచ్చిందో ఇప్పుడు అదే వెయిటేజీ బియ్యాన్ని అప్పగించాలి. ప్రభుత్వానికి అప్పగించకుండా ప్రైవేటుగా అమ్ముకుంటే డీలర్లపై చర్యలు తప్పవు.
- వెంకటేశ్వరరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి, కామారెడ్డి