రియలిస్టిక్ యాక్షన్స్ సీక్రెట్ సోల్జర్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్‌రెడ్డి దర్శకత్వంలో (Director Akki Viswanath Reddy) రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్‌లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేశ్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.
ఈ చిత్రం సెప్టెంబర్ 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరులతో పంచుకున్న చిత్ర విశేషాలివీ.. “చైనా పీస్’గా మొదలైన మా ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా మారింది. సెన్సార్ అభ్యంతరాలు ఎదర్కొన్నాం. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్టు పంపించారు. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదంటే ‘సీక్రెట్ సోల్జర్’గా మార్చాం.
మా సినిమా సెన్సార్‌లో 8 నెలలు ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో తీశామో.. ఆ విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. స్పై యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది. -ఇండియాకు సంబధించిన ఓ కీలక సమచారం లీక్ కావడం.. ఆ సంఘటనకూ, నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకూ లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఈ మూవీ లైన్. -స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌ను చాలా కొత్తగా ప్రేక్షకులు చూడబోతున్నారు” అని తెలిపారు.