రిలయన్స్ గుడ్‌న్యూస్

02-10-2026 | 05:33pm

ఏపీలో రిలయన్స్ భారీ ప్లాన్.. రూ.లక్ష కోట్ల పెట్టుబడి!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటుకు రిలయన్స్(Reliance) ఇండస్ట్రీస్ భారీ పెట్టుబడులకు సిద్ధమవుతోంది. ఈ రంగంలో సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే ప్రణాళిక ఉందని సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ(Anant Ambani ) తెలిపారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.

మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో అనంత్ అంబానీ ఈ వివరాలను వెల్లడించారు. క్లీన్ ఎనర్జీ, రైతులకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు కల్పించడంలో CBG ప్రాజెక్టులు(CBG plants) కీలకంగా నిలుస్తాయని ఆయన అన్నారు. రిలయన్స్ ప్రణాళికలు పూర్తిస్థాయిలో అమలైతే రాబోయే దశాబ్దాల్లో రాష్ట్రానికి సుమారు రూ.60 వేల కోట్ల ఆదాయం సమకూరే అవకాశం ఉందని అనంత్ అంబానీ పేర్కొన్నారు. రైతులు ఆహార భద్రతతో పాటు దేశ ఇంధన భద్రతలోనూ భాగస్వాములు కావాలని ఆయన అన్నారు.

ఇప్పటికే రిలయన్స్ ఆంధ్రప్రదేశ్‌లో CBG రంగంపై పెద్ద ఎత్తున ప్రణాళికలు చేపట్టింది. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 500 CBG ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక ఉంది. వీటి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి, వ్యవసాయ వ్యర్థాల వినియోగం, ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తికి అవకాశాలు కల్పించాలన్నది సంస్థ లక్ష్యంగా పేర్కొంది.

మరిన్ని వార్తలు