సంఘబంధం అధ్యక్షురాలుగా రేణుక
21-09-2026 | 09:42pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 21: జాజిరెడ్డిగూడెం మండలం,జాజిరెడ్డిగూడెం గ్రామ సంఘబంధం(Jajireddygudem Village Organization Federation) నూతన కమిటీని ఎన్నుకున్నారు.సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని మండల సమాఖ్య కార్యాలయంలో జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు.అధ్యక్షురాలుగా జేరిపోతుల రేణుక,ఉపాధ్యక్షురాలుగా చల్లా ఉపేంద్ర,ప్రధాన కార్యదర్శిగా రింగు సంతోష,సహాయ కార్యదర్శిగా రేగటి మంగమ్మ,కోశాధికారిగా బోయపల్లి చిలుకమ్మలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ నియామక కమిటీ కార్యక్రమంలో అధికారులు ఏపీఎం రాంబాబు,సీసీ నాగార్జున,వీబీకే సురాంబా,సమభావన సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.నూతనంగా ఎన్నికైన సంఘబంధం కమిటీకి ప్రజాప్రతినిధులు,అధికారులు,సమభావన సంఘం మహిళలు శుభాకాంక్షలు తెలిపారు.