బండి సంజయ్ నా ప్రాణ మిత్రుడు

01-10-2026 | 05:30am

కరీంనగర్ కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) తన ప్రాణ మిత్రుడు అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం కరీంనగర్ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బండి సంజయ్ తనకు ప్రాణ మిత్రుడు అని సరదాగా వ్యాఖ్యానించారు.

వేదికపై కలిసినప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. రాజకీయాలకు అతీతంగా చమత్కరించుకున్నారు. కాంగ్రెస్, బీజేపీ చెందిన నేత లైనప్పటికీ, వీరిద్దరూ పరస్పరం గౌరవించుకుం టూ, హాస్య చతురతతో మాట్లాడుకోవడం ఆకట్టుకున్నది. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందిస్తూ.. ప్రజా సమస్యల విషయంలో తాము ఎప్పటికీ రాజీపడబోమని, రాజకీయంగా తమ పోరాటం కొనసాగుతున్నదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు