కేసీఆర్‌కు తప్పవా? తిప్పలు! ఎర్రవల్లి భూములపై అధికారుల కసరత్తు
సిద్దిపేట: తెలంగాణ వ్యాప్తంగా భూముల వ్యవహారంపై రచ్చ జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశాలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి భూములపై(KCR's Erravalli lands) రెవెన్యూ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. నిన్న సిద్దిపేట జిల్లా మర్కుక్ తహశీల్దార్ కార్యాలయంలో(Markook Tahsildar Office) అధికారులు రికార్డులు చెక్ చేశారు. కేసీఆర్ భూముల లెక్కలను 30 రోజుల్లో తేల్చాలని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖకు ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లా(Siddipet District) ఎర్రవల్లిలో రెండోరోజు భూముల సర్వే జరుగుతోంది. ఎర్రవల్లి, శివారు వెంకటాపూర్, వరదరాజ్ పూర్ లోని సర్వే నంబర్ 325 భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే వ్యవహారంలో కేసీఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు(Revenue officials) రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కు 67.13 ఎకరాల భూమి ఉందని రేవంత్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. కొందరు రైతులు 325 సర్వే నంబర్ లోని భూములను సాగుచేసుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, కేసీఆర్ కుటుంబం ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు ఉన్న 'అసైన్డ్' భూములపై(Assigned lands) విచారణ జరుపుతామని రేవంత్ రెడ్డి ప్రకటించిన మరుసటి రోజే, గురువారం నాడు రెవెన్యూ శాఖ అధికారుల బృందం కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిధిలోని భూములపై సర్వేను ప్రారంభించింది. జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఎ.డి. సుదర్శన్, ఆర్.డి.ఓ. చంద్రకళ(RDO Chandrakala) తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని, వివాదాస్పద భూములకు సంబంధించిన రికార్డులన్నింటినీ పరిశీలించారు. అధికారులు ఎర్రవల్లి, వెంకటాపురం గ్రామాలకు సంబంధించిన సర్వే నంబర్లను సరిచూసి, ప్రభుత్వ,పట్టా (ప్రైవేట్) భూములకు సంబంధించిన సమగ్ర వివరాలను సేకరించారు. ముఖ్యంగా, కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని 385 ఎకరాల ప్రభుత్వ భూమి స్థితిగతులపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.
సిద్దిపేటలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు
నేడు సిద్దిపేటలకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు(Congress public representatives) వెళ్లనున్నారు. అసెంబ్లీ సీఎల్పీ పాయింట్(Assembly CLP Point) నుంచి బస్సు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటలకు బస్సు అసెంబ్లీ నుంచి బయలుదేరనుంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు సిద్దిపేట కలెక్టరేట్, స్థానిక రెవెన్యూ ఆఫీస్ లో భూ రికార్డులను పరిశీలించనున్నారు. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న మాట్లాడుతూ.. కేసీఆర్ భూ బకాసురుడని ఆరోపించారు.