ఐదు రాష్ట్రాల సంగమం.. అందునాయక్ తండా
రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర భారతదేశం నుండి తరలివచ్చిన మత్తురా లాభానాలు..
అందునాయక్ తండాలో కొనసాగుతున్న ఋషి పంచమి ఉత్సవాలు..
ఉట్నూర్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): మత్తురా లాభానా(Mathura Labana)ల కుల దేవతలు కొలువుదీరిన అందు నాయక్ తాండ(Andu Nayak Tanda) గ్రామం ఐదు రాష్ట్రాల ప్రజలకు సంఘమంగా మారింది. ప్రతి ఏటా పితృ మాసంలో లాభానాలు భక్తి శ్రద్ధలతో కుల దేవతల మొక్కులు తీర్చుకునే పంచమి ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలోని వివిధ మండలాల్లో నివాసముండే లాభానాలతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాలలోని వివిధ జిల్లాలను నివాసముండే లాభానాలు కుటుంబ సమేతంగా ప్రత్యేక వాహనాలను తరలివచ్చారు.
అందుతాండాలో కొలువుదీరిన దుర్గాదేవి, కాలు బాబా, బాచు బాబాలకు మొక్కులు తీర్చుకునే సమయం వరకు మత్తురా లాభానాలు తమ సాంప్రదాయాలను నృత్యాలను తండాల వారితో పోటీపడి ప్రత్యేక నృత్యాలు చేశారు. అందుతాండా తోపాటు ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయకుంట గ్రామంలో పంచమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు వివిధ గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. అందుతాండాలోని కాలు బాబా, పాచి బాబా ఆలయ పూజారి మత్తురా లాభానాల కుల గురువు బాబా రామసేన మహారాజ్ ఆశీస్సులను తీసుకున్నారు. ప్రతి ఏట నిర్వహించే ఈ ఉత్సవాలకు ఐదు రాష్ట్రాలకు చెందిన మత్తురా లాభానా లు అందుతాండలో కలుసుకొని క్షేమమాచారాలు తెలుసుకోవడంతో పాటు కుల దేవతల మొక్కులు తీర్చుకున్నారు.