లారీలో భారీగా మంటలు.. డ్రైవర్ సహా 200 మేకలు సజీవదహనం
10-09-2026 | 11:21am
భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar district) భూత్పూర్ వద్ద జాతీయ రహదారిపై(National Highway) గురువారం ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున లారీకి నిప్పంటుకోవడంతో డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. మరో ఐదుగురు గాయాలతో బయటపడ్డారు. మేకలతో వెళ్తున్న లారీ కర్నూలు వైపు వెళ్తుండగా జాతీయ రహదారిపై ఉన్న ఒక సైన్‌బోర్డును ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది.
ఈ ప్రమాదంలో దాదాపు 200పైగా మేకలు మృతి చెందినట్లు సమాచారం. లారీని మంటలు చుట్టుముట్టడంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుపోయాడు. అతను అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వారు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, గంటలోపే మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.