తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. హైదరాబాద్ భక్తులు సేఫ్
19-07-2026 | 01:20pm
తిరుమల: తిరుమలలోని రెండవ ఘాట్ రోడ్డులో(Tirumala Ghat Road) ఆదివారం ఉదయం ప్రమాదం(Road Accident) జరిగింది. ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్తున్న హైదరాబాద్‌కు చెందిన ఐదుగురు భక్తులకు ఈ ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడటంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన వల్ల ట్రాఫిక్‌కు తాత్కాలిక అంతరాయం ఏర్పడింది. ఆ మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న ఘాట్ రోడ్డు భద్రతా సిబ్బంది సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని వాహనాన్ని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేపట్టారు.






