పకడ్బందీగా ఎస్‌ఐఆర్

08-09-2026 | 04:25am

1.13 లక్షల మంది ఓటర్లకు నోటీసుల జారీ

నాగర్ కర్నూల్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి(Telangana State Election Officer Sudarshan Reddy)కి  కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్(Collector Hemant Keshav Patil) తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో 1,15,824 మంది ఓటర్లకు నోటీసులు జనరేట్ చేయగా 1,13,996 మందికి జారీ చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు 32,553 మందికి హియరింగ్ పూర్తి చేసినట్లు వెల్లడించారు. ఓటర్లు సమర్పించిన ధ్రువపత్రాలను పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నామని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ తెలిపారు.


మరిన్ని వార్తలు