మార్కండేయ ఆలయంలో రుద్రాభిషేకం
మహిళల కుంకుమార్చన
అన్న ప్రసాద వితరణ
నవరాత్రోత్సవాల్లో భక్తుల సందడి
హాజరైన నాయకులు, అధికారులను సత్కరించిన పద్మశాలి సంఘం
రామాయంపేట,(విజయక్రాంతి): రామాయంపేట పట్టణంలోని భక్త మార్కండేయ ఆలయం(Markandeya Temple)లో సోమవారం మహిళల కుంకుమార్చన వైభవంగా సాగింది. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం(Rudrabhishekam )తో ప్రారంభమైన వేడుకలు అన్నప్రసాద వితరణతో ముగిశాయి. పద్మశాలి సంఘం(Padmasali Society) నిర్వహణలో ఈ ఉత్సవాలు జరగ్గా.. భక్తుల సందడి నెలకొంది.
దీనిలో కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, పుట్టి సందీప్, దేవుని రంజిత్, దేమే యాదగిరి లతోపాటు కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి, డాకి స్వామి, బిఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత్ రావు, పద్మశాలి జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు, టి. యు.డబ్ల్యూ.జే జిల్లా సంయుక్త కార్యదర్శి మర్కు నగేష్, రామయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మద్దెల సత్యం,కట్ట ప్రభాకర్, రామారావు యాదగిరి లు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పద్మశాలి అధ్యక్షులు మద్దెల రమేష్ శాలువాలతో సత్కరించారు.