శాంసంగ్‌ ఇండియాలో లేఆఫ్స్‌.. 100 మంది ఎగ్జిక్యూటివ్‌లకు షాక్‌!

08-09-2026 | 03:01pm

టెక్‌ దిగ్గజం శాంసంగ్‌(Samsung) ఇండియాలో వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. టీవీ, హోమ్‌ అప్లయన్సెస్‌ సహా పలు విభాగాల్లో 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌ స్థాయి ఉద్యోగులను తొలగించినట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. డిమాండ్‌ మందగించడం, సంస్థ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్రాంచ్‌ మేనేజర్లు, టీమ్‌ లీడర్లు, డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగులపై కూడా లేఆఫ్‌ ప్రభావం పడే అవకాశం ఉంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు