సంతోషిమాత విగ్రహంపై దాడి

02-10-2026 | 03:07pm

దిల్ సుఖ్ నగర్ లోని సంతోషిమాత ఆలయంలో, అమ్మవారి విగ్రహం, పూజారిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి

ఎల్బీనగర్, అక్టోబర్ 2 : దిల్ సుఖ్ నగర్ లోని సంతోషిమాత ఆలయంలో (Santoshimata Temple)అమ్మవారి విగ్రహంతోపాటు పూజారిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం సృష్టించింది.  దిల్ సుఖ్ నగర్ బస్ డిపో పక్కన ఉన్న పవిత్రమైన సంతోషిమాత దేవాలయంలో ఒక ముస్లిం మతోన్మాది గుడిలోకి చొరబడి భక్తులు ఉండగానే విగ్రహంపై దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న పూజారిపై పై కూడా  దాడికి పాల్పడ్డాడు.

భక్తులు దుండగుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న వేలాది మంది హిందువులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... హిందూ దేవుళ్ళపై ముస్లిం మతోన్మాదులు ఎప్పటికప్పుడు ఏదో విధంగా ఏదో రూపంలో దాడులు చేస్తున్నారని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చర్యలు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఏవైనా నిమ్మకు నీరెత్తినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు.

ఆందోళనలు మాజీ కార్పొరేటర్ రంగా నర్సింహగుప్తా, నేషనల్ ఈడబ్ల్యూఎస్‌ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పశుపతి గుప్తా, వివిధ హిందూ హిందూ సంఘాల నాయకులు పాల్గొన్నారు.  కాగా, చైతన్యపురి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. ఆలయాన్ని ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి, చైతన్యపురి సీఐ సైదులు తదితరులు సందర్శించి, దాడి జరిగిన విషయాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు