18 August, 2026 | 4:49 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

18-08-2026 04:05 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో తెలంగాణ వీరయోధుడు, బహుజన ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... బహుజన రాజ్యాధికార సాధన కోసం పోరాడిన మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. మొఘల్ పాలకుల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరించి తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన గొప్ప వీరయోధుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. సామాజిక సమానత్వం, స్వాభిమానం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం పాపన్న గౌడ్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ్ సంఘం నాయకులు రంగు ప్రసాద్ గౌడ్ విజయ్ గౌడ్ వాసు గౌడ్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళులు అర్పించారు.