కూలీ పైన సర్పంచ్ తమ్ముడి దాడి
24-09-2026 | 02:55pm
చందుర్తి, సెప్టెంబర్ 24,(విజయక్రాంతి): మండలంలోని సనుగుల గ్రామ సర్పంచ్(Sarpanch of Sanugula village) తమ్ముడు రోజు వారి కూలీ పిట్టల రాజు పైన బుధవారం సాయంత్రం దాడి చేసాడని ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ విషయమై పిట్టల రాజు వివరణ ఇస్తూ...ప్రజావాణిలో సర్పంచ్ భర్త పెత్తనం చెలయిస్తున్నాడని పూర్తి ఆధారాలతో జిల్లా కలెక్టర్ కి పిర్యాదు ఇవ్వడానికి వెళ్లాడనే నెపంతో రాజు పైన, సర్పంచ్ తమ్ముడు కక్ష పూరితంగా దాడి చేసాడని తెలిపాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతూ, బెదిరించి,నా ఫోన్ లాక్కున్నాడని, నా పైన దాడి చేసి ఫోన్ లాక్కోవడం ఎంత వరకు కరెక్టని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రశ్నించే గొంతులను అణచివేస్తారా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. ఈ దాడిపై న్యాయం కోసం చందుర్తి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసానని తెలిపాడు.