18 August, 2026 | 2:43 PM

కళ్లేపల్లిలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు

18-08-2026 02:07 PM

బెజ్జంకి,(విజయక్రాంతి): మండలంలోని కళ్లేపల్లి గ్రామంలో సర్వాయి పాపన్న జయంతిని గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ బిగుల్లా మోహన్ మాట్లాడుతూ, సర్వాయి పాపన్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.