ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ
- సెమీస్‌లో అద్భుత విజయం
- చైనా మాస్టర్స్ టోర్నీ
బీజింగ్, సెప్టెంబర్ 5 : భారత స్టార్ బ్యా డ్మింటన్ జోడీసాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా మాస్టర్స్ 2026 టోర్నమెంట్‌లో (China Masters 2026 Tournament) ఫైనల్లోకి దూసుకెళ్లారు. సెమీఫైనల్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన నూర్ అ జ్రిన్ అయూబ్, తాన్ వీ కియాంగ్ జోడీపై ఘన విజయం సాధించారు. సుమారు ఒక గంటా ఆరు నిమిషాల పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో ప్రపంచ నంబర్ 5 జోడీ అయిన సాత్విక్-చిరాగ్ 21- 18- 21 తేడాతో గెలుపొందారు. ప్రా రంభం నుంచే దూకుడు ప్రదర్శించిన భా రత జోడీ 21- తొలి గేంను సొంతం చేసుకుంది.
అయితే రెండో గేమ్‌లో మలేషియా జోడీ గట్టి పోటీ ఇవ్వడంతో సాత్విక్-చి రాగ్ 18- ఈ గేంను చేజార్చుకున్నారు. ఆఖరి గేంలో తిరిగి పుంజుకున్న భారత ద్వ యం పూర్తి ఆధిపత్యం చలాయించి 21- తో గేమ్తో పాటు మ్యాచ్‌ను ముగించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. సాత్విక్ -చిరాగ్ జోడీ చైనా మాస్టర్స్‌లో ఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి. ఈ టోర్నీలో ప్రస్తుతం భా రత్ తరఫున సాత్విక్-చిరాగ్ జోడీ మాత్రమే రేసులో నిలిచింది. పురుషుల సింగిల్సలో భారత స్టార్ కిదాంబి శ్రీకాంత్ పోరాటం క్వార్టర్ ఫైనల్‌లోనే ముగిసింది.






