ప్రసాద్ ఆచూకీ కోసం గాలింపు
25-08-2026 03:52 PM
బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రానికి చెందిన కోట ప్రసాద్ ఈ నెల 17న ఇంటి నుంచి ఎరుపు రంగు స్కూటీపై బయటకు వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు ఆచూకీ కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో ఆయన భార్య ధనలక్ష్మి మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసాద్ ఆచూకీ తెలిసిన వారు బూర్గంపహాడ్ పోలీస్‌స్టేషన్, 87126 82056, ధనలక్ష్మి నెం.99519 40428 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.






