జిల్లాలో 30 పోలీస్ యాక్ట్
30-09-2026 | 04:39pm
ఆసిఫాబాద్,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 31 వరకు 30 పోలీస్ యాక్ట్ (Police Act) అమల్లో ఉంటుందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముందస్తు అనుమతి (Prior Permission) లేకుండా ధర్నాలు, బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రజలు గుమికూడే కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. జిల్లాలో శాంతిభద్రతలకు (Law & Order) విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.
నిషేధిత ఆయుధాలు (Prohibited Weapons) కలిగి ఉండటం, బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా గుంపులుగా సమావేశం కావడం వంటి చర్యలకు పాల్పడరాదని సూచించారు. పోలీస్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు (Legal Action) తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.