కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు
ఆసిఫాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ కబడ్డీ అసోసియేషన్(Komaram Bheem Asifabad Kabaddi Association) ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో సబ్‌జూనియర్ బాలికలు, జూనియర్ బాలికలు, జూనియర్ బాలుర జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 191 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ మల్లికార్జున్ యాదవ్ హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా క్రీడాకారులను జిల్లా జట్లకు ఎంపిక చేశారు.
ఎంపికైన సబ్‌జూనియర్ బాలికలు, జూనియర్ బాలురు ఈ నెల 26 నుంచి 29 వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగే కబడ్డీ పోటీల్లో కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఆత్రం ధర్మారావు మాట్లాడుతూ.. ఎంపికైన క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ మడావి శేకు, జీసీడీఓ శకుంతల, యంగ్ ఇండియా పీడీ మీనా రెడ్డి, ఖేలో ఇండియా కోచ్ రాకేష్, పీడీలు ప్రవీణ్ కుమార్, శారద, హరికృష్ణ, మంజుల, శ్రీలత, సభిత, విద్యాసాగర్, రవి, అరవింద్‌తో పాటు కబడ్డీ అసోసియేషన్ సభ్యులు చంద్రశేఖర్, చిత్రు, మోహన్, ఇమ్రాన్, ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.