21 August, 2026 | 5:03 AM

కుటుంబ పోషణ కోసం వీధుల వెంట వ్యాపారం

21-08-2026 01:32 AM
  1. రేక్కాడితే గాని డొక్కాడని బతుకులు.                          
  2. సహాయ పడాలంటున్నజవహర్‌నగర్ వీధి వ్యాపారులు        

జవహర్‌నగర్, ఆగస్టు 20 (విజయక్రాం తి):  సూపర్ మార్కెట్లు, ఆన్లైన్ మార్కెట్ లు రావడంతో వీధుల వెంట  వ్యాపారుల చేసే వీధి వ్యాపారుల పరిస్థితి దయనీయంగా తయారయింది. పోటీ పెరగడంతో వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. జవహర్ నగర్ లో సుమారుగా 100కు పైగా కాలనీలో విస్తరించి మెగా కా ర్పొరేషన్ గా ఏర్పడ్డాక ప్రజల అవసరాల కో సం వీధి వ్యాపారాలు ఎక్కువగా రోడ్ల వెం బడి కాలనీల వెంబడి నిత్యం జరుగుతుండ గా వీధి వ్యాపారుల  బ్రతుకులు మాత్రం అ గమ్య గోచరంగా తయారయ్యాయి.

వీధి వ్యాపారులు  సరసమైన  వస్తువుల సేవల ను అందించడం ద్వారా జవహర్ నగర్ పట్టణంలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. అ యినప్పటికీ వారి జీవితాలు  ఆర్థిక అభద్రత అస్థిరమైన పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు ప్రమాదాలు సామా జిక వివక్ష తదితర సామాజిక రుగ్మతలతో బాధపడుతున్నారు.                  

డైలీ ఫైనాన్స్ కష్టాలు: 

మూలిగే నక్క మీద తాటి పండు పడ్డచందంగా అసలే ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడు తున్న వారికి డైలీ ఫై నాన్స్ రుణ ఉచ్చులో చిక్కుకుంటున్నారు.                     

సామాజిక నిరాధారణ: 

వీధి వ్యాపారాలు తరచుగా నైపుణ్యం లేని వారుగా లేదా చదువు లేని వారుగా ముద్ర పడినందువల్ల వీరు సమాజంలో ఎక్కువగా వి వక్షతకు గురవుతున్నారు.                    

వ్యాపారాల్లో మహిళలే అధికం: 

జవహర్ నగర్ వీధులు ప్రధాన రోడ్ల వె ంబడి చిరు వ్యాపారం నిర్వహించేది ఎక్కువగా మహిళలే కావడం  గమనార్హం. కూ రగాయల నుండి మొదలుకొని పువ్వులు పండ్లు రెడీమేడ్ గాజులు ఫ్యాన్సీ వస్తువులు తదితర వస్తువుల్ని ఎక్కువగా విక్రయించేది మహిళలే. వీరు తమ వస్తువులను తదితరాలను విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు.   

దుర్భర జీవితం:

జవహర్ నగర్ పట్టణ వీధుల్లో వీధి వ్యా పారుల ఆర్థిక పరిస్థితి దుర్భరంగా మారింది అధిక వడ్డీలకు వడ్డీకి తెచ్చిన అప్పులు  తె చ్చిన సామాగ్రిని విక్రయిస్తుండగా సరైన అ మ్మకాలు లేక నష్టాలు వెంటాడుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారుల కోసం ఆత్మనిర్బర స్వ నిధి సమృద్ధిని ప్రవేశపెట్టింది. తక్కువ వడ్డీలకు రుణాలు ఇవ్వడం రాయతీలు కల్పించడం వ్యాపారుల కుటుంబాల సామాజిక ఆర్థిక స్థి తులను తెలుసుకొని సంక్షేమ పథకాలు చో టు కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 

ప్రభుత్వం ఆదుకోవాలి.                 

ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం వీధి వ్యాపారుల పట్ల వీధి వ్యాపారుల అభివృద్ధి కోసం వీధి వ్యాపారుల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడి వారికి జీవన సౌకర్యాలు కల్పించాలని జవహర్ నగర్ ప్రజలు కోరుకుంటున్నారు.

దూర ప్రాంతాల నుంచి వచ్చాం.. 

దూర ప్రాంతమైన ఉత్తరప్రదేశ్ నుండి పొట్ట చేత పట్టుకొని జవహర్ నగర్ వచ్చాం. పోటీ తీవ్రంగా ఉంది దినసరి సరుకులకే డబ్బుల్లేక అప్పు తెచ్చుకొని చాట్ బండారు నడుపుతున్నాను. 

 నరేష్ సింగ్ (అంబేద్కర్ నగర్ చాట్ బండార్ వ్యాపారి)

చాలీచాలని బతుకులు..

ఈ వ్యాపారంలో పూట గడవడం కష్టంగా ఉంది సూపర్ మార్కెట్లు పెద్దపెద్ద కూరగాయల మార్కెట్ రావడం వల్ల మా వీధి వ్యాపారం సరిగ్గా నడవట్లేదు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. 

 వక్కలగూడెం నిర్మల (కూరగాయల వ్యాపారి ప్రగతినగర్)

గిరాకీలు సరిగా లేవు 

ఆన్లైన్ వ్యాపారాల వల్ల మా గిరాకీలు సరిగా నడవట్లే, దినసరి కూలీ కూడా గిట్టుబాటు కావట్లేదు గిరాకి లేక కూరగాయలు ఎండిపోతున్నాయి. 

 లలిత కూరగాయల వ్యాపారి (గబ్బిలాలపేట)