బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో బిజెపి పార్టీలో పలువురు చేరిక
ఎర్రుపాలెం సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): మండల పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం(Buchireddypalem) గ్రామం నుంచి బిజెపి పార్టీలోకి పలువురిని ఆహ్వానించారు. మండల అధ్యక్షులు అనుమోలు సురేష్(Anumolu Suresh) అధ్యక్షతన బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు నూతక్కి నరసింహారావు ఆధ్వర్యంలో ఎర్రుపాలెం మండలం బుచ్చిరెడ్డిపాలెం గ్రామం నుంచి బిజెపిలో చేరిన వలపనబోయిన శ్రీనివాసరావు, వలపనబోయిన లక్ష్మి, వెన్నబోయినదుర్గారావు లను పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం గ్రామంలో బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని వారు తెలియజేశారు.
అనంతరం వలపనబోయిన శ్రీనివాసరావు, లక్ష్మి దంపతుల కుమార్తె లోహిత శ్రీ నీట్ లో ర్యాంకు సాధించి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీటు సంపాదించినందుకు లోహిత శ్రీని భారతీయ జనతా పార్టీ ఎర్రుపాలెం మండల కమిటీ తరపున అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బనిగండ్లపాడు బూతు అధ్యక్షులు దండముడి సతీష్ కుమార్, స్థానిక నాయకులు పాల్గొన్నారు






