బాలికపై లైంగిక దాడి
- సహకరించిన బాలిక తల్లి
- గర్భం దాల్చిన బాలిక
- సోదరి అండతో పోలీసులకు ఫిర్యాదు
- ఉప్పల్‌లో ముగ్గురిపై పోక్సో కేసు
ఉప్పల్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా(Medchal District) ఉప్పల్‌లో ఘోరం జరిగింది. తల్లికి పరిచయమున్న వ్యక్తి తనపై పలుమార్లు లైంగిక దాడి(Sexual assault)కి పాల్పడినట్లు బాలిక పోలీసులను ఆశ్రయించింది. అంతేకాకుండా ఈ ఘటనలను అడ్డుకోవాల్సిన తల్లి.. నిందితుడికి సహకరించిందని బాలిక ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తల్లికి పరిచయమున్న నిందితుడు తమ ఇంటికి రాకపోకలు సాగించేవాడు. ఈ క్రమంలో బాలికను బెదిరించి లైంగిక దాడి(Sexual assault)కి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా తల్లి అడ్డుకున్నట్లు బాలిక ఆరోపించింది.
కొంతకాలం ఈ విషయం కుటుంబానికి, బయటివారికి తెలియకుండా ఉండగా.. బాలిక గర్భం దాల్చ డంతో ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. తనకు ఎదురైన పరిస్థితిని కొంతకా లం భరించిన బాలిక చివరకు తన సోదరికి విషయం చెప్పినట్లు తెలిసింది. బాలిక పరిస్థితిని తెలుసుకున్న సోదరి ఆమెకు అండగా నిలిచి పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం.
అంతకుముందు బాలికను మేడిపల్లి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)కి తీసుకెళ్లి చికిత్స చేయించినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు(Case registered) చేసి దర్యాప్తు ప్రారంభించారు. తల్లితో పాటు ప్రధాన నిందితుడు, మరో బంధువుపై పోక్సో చట్టం(POCSO Act) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం