ఎస్ జి ఎఫ్ మండల స్థాయి క్రీడలు
21-09-2026 | 08:28pm
కొడిమ్యాల, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి(SGF Mandal Level) కోకో కబడ్డీ అండర్ 17 బాల బాలికలకు మూడవ రోజు సోమవారం క్రీడలు ఉత్సాహంగా కొనసాగాయి. ఇందులో బాలబాలికల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించగా కబడ్డీ అండర్-17 బాలుర విభాగంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల కొడిమ్యాల, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొడిమ్యాల జట్లు ఫైనల్ కు చేరాయి. అండర్ 17 బాలుర ఫైనల్ మ్యాచ్ మంగళవారం నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి ఐత శ్రీనివాస్, కన్వీనర్ బూట్ల రాజ మల్లయ్య తెలిపారు.