శ్రేయస్ అయ్యర్‌కు దిమ్మతిరిగే షాక్..13కే క్లీన్ బౌల్డ్

01-10-2026 | 11:01am

నిషిన్: ఆసియా క్రీడలు 2026లో(IND vs SL Asian Games 2026) భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న కీలక సెమీఫైనల్‌లో(India vs Sri Lanka semifinal) టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. శ్రీలంక కెప్టెన్ సహన్ అరచ్చిగే వేసిన అద్భుతమైన బంతికి అయ్యర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. భారత్-శ్రీలంక సెమీఫైనల్ నిషిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో జరుగుతోంది.

బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపించని పిచ్‌పై అరచ్చిగే వేసిన బంతి అద్భుతంగా టర్న్ అయింది. మంచి లెంగ్త్‌లో పడిన బంతి పిచ్ నుంచి డిప్, గ్రిప్ తీసుకుని అయ్యర్ బ్యాట్‌ను దాటింది. వెంటనే ఆఫ్‌స్టంప్‌ను తాకడంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. 13 బంతులు ఎదుర్కొన్న అయ్యర్(Shreyas Iyer OUT) 13 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో టీమిండియా టాప్ ఆర్డర్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. మ్యాచ్ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటింగ్ లైనప్‌కు ఇది పరీక్షగా మారింది.

ఇక శ్రీలంక కెప్టెన్ సహన్(Sahan Arachchige bowling) అరచ్చిగే బౌలింగ్‌లో చూపించిన ఈ తెలివైన మార్పు మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది. బంతికి వచ్చిన టర్న్‌ను అంచనా వేయడంలో అయ్యర్ విఫలమవగా.. బంతి నేరుగా ఆఫ్‌స్టంప్‌ను తాకింది. భారత్-శ్రీలంక( IND vs SL) మ్యాచ్‌కు భారీ ప్రాధాన్యం ఉంది. ఈ సెమీఫైనల్‌లో గెలిచిన జట్టు గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో ఆడనుంది. కాబట్టి కీలక దశలో కెప్టెన్ అయ్యర్ వికెట్ పడటం టీమిండియాకు పెద్ద పరిణామంగా మారింది. ఇప్పటికే మ్యాచ్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అయ్యర్ వికెట్ తర్వాత భారత బ్యాటింగ్‌ను ఎవరు నిలబెడతారు? టీమిండియా ఒత్తిడిని అధిగమించి ఫైనల్ బెర్త్ సాధిస్తుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు