కొండా లక్ష్మణ్‌కు ఉద్యమాలే ఊపిరి

22-09-2026 | 05:10am

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి) : ఉద్యమాలే ఊపిరిగా... పోరాటాలే పరమావధిగా బ్రతికిన ధీశాలి కొండా లక్ష్మ ణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. స్వాతంత్య్ర ఉద్యమం(Freedom Movement) నుండి మొదలుకొని మలిదశ తెలంగాణ ఉద్యమం(Second Phase of the Telangana Movement) వరకు... ప్రజా ఉద్యమా ల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. సోమవారం ఆచా ర్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఘన నివా ళులు అర్పించారు.

కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కొండా లక్ష్మణ్ బా పూజీ ఇంట్లోనే పుట్టింది... జలదృశ్యం సాక్షి గా మలిదశ తెలంగాణ ఉద్యమానికి బీజం పడిందని గుర్తు చేశారు. రాష్ట్ర సాధన తర్వా త కేసీఆర్ ప్రభుత్వం(KCR Government) ట్యాంక్ బండ్ వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిందని, వారి పేరు హార్టికల్చరల్ యూనివర్సిటీ(Horticultural University)కి పెట్టుకుని వారిని గౌరవించిందని తెలిపారు. 

గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ : హరీష్‌రావు

పదవుల కంటే ప్రజల పక్షాన నిలబడటమే నాయకత్వమని తన ఆచరణతో చూపిన గొప్ప దార్శనికుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీ మంత్రి హరీష్‌రావు(Harish Rao) తెలిపారు. సోమవారం కొండా లక్ష్మణ్ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా హరీష్‌రావు నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సమరం నుండి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆయన జీవితమంతా ఒక నిరంతర పోరాటం అని పేర్కొన్నారు. నాడు 1969 ఉద్యమ సమయంలోనే తెలంగాణ కోసం తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న నిస్వార్థ త్యాగమూర్తి అన్నారు.

మరిన్ని వార్తలు