చౌబీస్ క్యారెట్ సోనియా..

01-10-2026 | 05:05am

సూపర్ స్టార్ రజనీకాంత్(Superstar Rajinikanth), డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన చిత్రం ‘జైలర్’. ఇప్పుడీ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ‘జైలర్ 2’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకా అక్టోబర్ 15న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రచార కార్యక్రమాల వేగం పెంచేశారు.

ఇందులో భాగంగా ‘అలా బోలేలో..’, ‘వన్ సన్ వన్ మూన్..’, ‘వన్ నేమ్..’ వంటి మూడు పాటలను విడుదల చేశారు. తాజాగా నాలుగో పాట ‘బిందాస్(Bindass)’ అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘చౌబీస్ క్యారెట్ సోనియా.. నేను మ్యాటరు మేనియా.. కరిగిపోయా తోడా తోడా..’ అంటూ సాగుతోందీ గీతం. ఈ పాటను అనిరుధ్ ట్యూన్ స్వరపర్చడమే కాక, దీప్తి సురేశ్‌తో కలిసి పాడారు. శ్రీనివాస మౌళి రాసిన ఈ గీతంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి తన హుషారైన స్టెప్పులతో అదరగొట్టింది.  

మరిన్ని వార్తలు