జీవనాధారం.. వెదురు జీవనరాగం

18-09-2026 | 05:05am

మానవ నాగరికత (Human civilization) ప్రకృతి ఒడిలో పురుడు పోసుకుంది. ప్రకృతిలోని (Nature) ప్రతి వనరూ మానవ జీవనానికి (human life) ఏదో ఒక రూపంలో తోడ్పడుతూనే ఉం ది. అలాంటి ప్రకృతి ప్రసాదించిన అపూర్వమైన వనరుల్లో వెదురు ఒకటి. అందుబాటులో ఉండటం, అనేక అవసరాలకు ఉపయోగపడటం, చౌకగా దొరకడం వల్ల వెదురును పేదవాడి కలప అన్నారు. ప్రపంచం సుస్థిర అభివృద్ధి వైపు అడుగులు వేయాలంటే పర్యావరణానికి హాని కలిగించని వెదు రు వస్తువులు వాడాలని, వెదురు ప్రాధాన్యాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ వెదురు దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రపంచ వెదురు సంస్థ (వరల్డ్ బాంబూ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో 2009 నుంచి ఈ దినోత్సవం ద్వా రా వెదురు యొక్క పర్యావరణ, ఆర్థి క, సామాజిక ప్రాధాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. 2026 సంవత్స రానికి ఈ సంస్థ బాంబూ బియాండ్ బార్డర్స్ అనే ఇతివృత్తంతో వెదురు దినోత్సవం జరపనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో వెదురు బొంగుల దినోత్సవాన్ని జరపడం అభినందనీయం. తెలంగా ణలో దాదాపు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా వెదురునే జీవనాధారంగా చేసుకుని జీవిసున్నారు. 

ముఖ్యంగా మేదరి కులస్థులు వెదురును ఆధారంగా చేసుకొని తడుకలు, గంపలు, బుట్టలు, చాటలు, సిబ్బులు, చంద్రికలు, పొనుకలు, విస నకర్రలు వంటి అనేక వస్తువులను తయారు చేస్తారు. శిశువు పుట్టినపుడు ‘చాట’లో వేయడం నుంచి మరణించినపుడు శవాన్ని మోసే ‘పాడె’ వరకు మనిషి జీవన చక్రంలో వెదురు అంతర్భాగమైంది. వెదురు పర్యావరణ పరిరక్షణలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. నేల కోతను అరికట్టడంలో, పచ్చదనాన్ని పెంచడంలో, కాలుష్యాన్ని అరికట్టడంలోఉపయోగపడుతుంది. 

గృహోపకరణ వస్తువులే కాకుండా, కాగితం తయారీకి అవసరమైన గుజ్జును తయారు చేయడంలోనూ వెదురును ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో వెదురు చిగుళ్లను, వెదురు గింజలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం, సంప్రదాయ వైద్యంలోనూ వెదురుకు స్థానం ఉంది. సంగీత ప్రపంచంలో వెదురుకు ఉన్న ప్రాధాన్యం మరింత ప్రత్యేకమైనది. సప్తస్వరాలను పలికించే వేణువుతో పాటు వివిధ సంప్రదాయ వాయిద్య పరికరాల తయారీలోనూ వెదురును ఉపయోగిస్తారు. వెదురు మానవ జీవితానికే కాదు మనిషి భావోద్వేగాలకు, కళలకు, జీవనరాగానికి కూడా తోడుగా నిలిచింది.

నేటి ఆధునిక కాలంలో ప్లాస్టిక్, లోహ ఆధారిత వస్తువుల వాడకం వల్ల వెదురు వస్తువుల వాడకం తగ్గింది. ఇదే సమయంలో వెదురు లభ్యత కూ డా సమస్యగా మారింది. అడవుల క్షీణత, వెదురు బొంగుల సేకరణపై పరిమితులు, వివిధ చట్టపరమైన ఆంక్షలు వెదురుపై ఆధారపడిన కుటుం బాల జీవనాన్ని మరింత సంక్లిష్టం చేశాయి. అందుకే చాలా మంది ఈ వృత్తికి దూరమయ్యారు. ప్రభుత్వాలు వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి, వెదురు వృత్తి కళాకారులకు నాణ్యమైన వెదురును అందుబాటులోకి తెస్తే ఈ వృత్తికి పునరుజ్జీవం ఇవ్వవచ్చు. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వె దురు బొంగుల దినోత్సవం వె దురు వృత్తి దారుల కుటుంబాల జీవితాల్లో మార్పు తీసు కుని వచ్చే అవకాశం ఉందని వెదురు వృ త్తి దారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు


మరిన్ని వార్తలు