గణేష్ నిమజ్జనం సకాలంలో పూజ చేయండి
బోథ్,(విజయక్రాంతి): గణేష్ నిమజ్జన ఉత్సవాల(Ganesh immersion festivals)ను సకాలంలో పూర్తిచేసి అన్ని వర్గాల ప్రజలకు సహకారం అందించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్(SP Akhil Mahajan) పేర్కొన్నారు. సోమవారం రాత్రి మండలంలోని పొచ్చెర దన్నూర్ ( బి) బోత్ మండల కేంద్రంలోని గణేష్ మండపాలను(Ganesh Mandapams) సందర్శించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిమజ్జనం సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. మండపాల నిర్వాహకులతో నేరుగా ఎస్పీ మాట్లాడారు.
మండల కేంద్రంలోని హనుమాన్ మందిర్ పోచమ్మ గల్లి మండపాలను సందర్శించి కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తారని ఎస్పీ వివరించారు. మండల కేంద్రంలోని మండపాలను దర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. డీజీలకు మరియు లేజర్ లైట్లకు ఇలాంటి అనుమతి లేదని తెలిపారు. రెచ్చగొట్టే విధంగా పాటలు పెట్టవద్దని సూచించారు. తమ దగ్గర నల్లధనం ఉందని1 00 112 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసుల సహకారం తీసుకోవాలన్నారు. ఆయన వెంట ఆదిలాబాద్ డిఎస్పి ఎల్జీవన్ రెడ్డి స్థానిక సీఐ గురుస్వామి ఎస్సై వి పురుషోత్తం పోలీసులు పాల్గొన్నారు.