6 September, 2026 | 10:52 AM

తాటిచెట్టుకు పిచ్చుక గూళ్లు!

06-09-2026 | 05:05am

కొడవటూరులో ప్రకృతి అద్భుతం

కోడూరు కార్తీక్, బచ్చన్నపేట, విజయక్రాంతి: తాటి చెట్టు అనగానే కొమ్మలు, కుండలు కనిపిస్తాయి. బచ్చన్నపేట మండలం కొడవటూరులో (Kodavaturu) విచిత్రంగా తాటిచెట్టుపై ఏకంగా వందకుపైగా పిచ్చుక గూళ్లు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. ఒకప్పుడు ప్రతి ఇంటి వాకిట్లో కనిపించే పిచ్చుకలు నేడు అక్కడక్కడ అరుదుగా కనిపిస్తున్నాయి.

సెల్‌ఫోన్ టవర్ల రేడియేషన్, పురుగు మందుల వాడకం పెరగడం వలన పిచ్చుక జాతి అంతరించిపోయే దశకు చేరుకుంది. అలాంటి సమయంలో కొడవటూరులో ఈ దృశ్యం ఒక గొప్ప సందేశం ఇస్తోంది.

మనం ప్రకృతికి హాని చేయకుండా ఉంటే, ప్రకృతి మనకు ఇలాంటి అద్భుతాలను బహుమతిగా ఇస్తుందనే పాఠం నేర్పుతోంది. అధికారులు, ప్రకృతి ప్రేమికులు ఈ ప్రాంతాన్ని గుర్తించి, ఇలాంటి తాటిచెట్లను, పిచ్చుకలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ప్రకృతిని కాపాడితే, మనల్ని కాపాడుతుందనడానికి ఈ వంద గూళ్ల తాటిచెట్టే ప్రత్యక్ష సాక్ష్యం.



మరిన్ని వార్తలు