పీవీఎన్ కాలనీలో గణనాథునికి ప్రత్యేక పూజలు
పాల్గొన్న ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతి కుమార్
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణం సింగరేణి ఉద్యోగుల(Singareni employees) పీవీఎన్ సెంటినరీ కాలనీలో కొలువుదీరిన గణేష్ మండపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐఎన్టియుసి ఉప ప్రధాన కార్యదర్శి తీగల క్రాంతికుమార్ వారు మాట్లాడుతూ... సత్తుపల్లి పీవీఎన్ కాలనీలో కుల, మతాలకు అతీతంగా కాలనీ కుటుంబ సభ్యులందరూ కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలను(Ganesh Navratri celebrations) ఘనంగా నిర్వహిస్తున్న కాలనీ కుటుంబ సభ్యులను, గణేష్ కమిటీ సభ్యులను అభినందించారు.
వినాయక విగ్రహ దాత దీపిక భాస్కర్ లాల్ దంపతులకు వారి కుటుంబ సభ్యులకు విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు. కాలనీలో ఆధ్యాత్మిక శోభ కనపరిచే విధంగా కాలనీ మహిళా సోదర సోదరీమణులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే పూజా కార్యక్రమాలు , సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయని అభినందించారు.గణేశుని ఆశీస్సులు కాలనీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.