21 August, 2026 | 9:45 PM

Breaking News

పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •   రూపారెడ్డి హత్యకు నిరసనగా భారీ ర్యాలీ   •   పోచమ్మ దేవాలయ విగ్రహ పున:ప్రతిష్ఠాపన వేడుకలు ప్రారంభం   •   కడుపునొప్పి భరించలేక విద్యార్థిని బలవన్మరణం   •   అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారే   •   రాయినిగూడెంలో బీజేపీ జెండా దిమ్మె తొలగింపు సరికాదు   •   ఆలేరు పోలీసుల తనిఖీల్లో 30 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం   •   భక్తిశ్రద్ధలతో సామూహిక వరలక్ష్మీ వ్రతం   •  

వాలీబాల్ క్రీడాకారునికి స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘన సత్కారం

21-08-2026 09:13 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి సిరిసిల్లలోని ప్రతిష్టాత్మక వాలీబాల్ అకాడమీలో శిక్షణ పొందేందుకు ఎంపికైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన యువ క్రీడాకారుడు మునీబ్‌ను శుక్రవారం సాయంత్రం సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా వాలీబాల్ సంఘం అధ్యక్షుడు, సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముత్యాల రవీందర్ ఆధ్వర్యంలో మునీబ్‌కు శాలువా కప్పి, పూలమాల వేసి అభినందనలు తెలిపారు.

భవిష్యత్తులో మరింత కృషి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి సుల్తానాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత యువతలో అపారమైన క్రీడా ప్రతిభ దాగి ఉంది. సరైన శిక్షణ, ప్రోత్సాహం లభిస్తే మునీబ్ లాంటి క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించగలరు. మునీబ్ సాధించిన ఈ అవకాశం సుల్తానాబాద్ యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం అని ముత్యాల రవీందర్ పేర్కొన్నారు.