క్రీడల్లో ఎంతో ఘన చరిత్ర కలిగి ఉంది
విద్యార్థి దశ నుండే అన్ని రంగాలలో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
సర్పంచ్ జీవన్ రెడ్డి
కొడిమ్యాల,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా(Jagtial District) కొడిమ్యాల మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాల(girls high school) ఆవరణలో అండర్ 14,అండర్ 17 బాలబాలికల కోకో, కబడ్డీ పోటీలు నిర్వహించారు. సర్పంచ్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండే అన్ని రంగాలలో రాణించేందుకు ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణ ఉపయోగపడుతుందని, విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు కొడిమ్యాల మండల వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో కృషి చేస్తున్నారని, కొడిమ్యాల క్రీడల్లో ఎంతో ఘన చరిత్ర కలిగి ఉందని అన్నారు. మండల విద్యాధికారి(Mandal Educational Officer) అయిత శ్రీనివాస్ మాట్లాడుతూ... విద్యార్థులు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసం పెంపొందాలంటే క్రీడలు తప్పనిసరని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్జీఎఫ్ కొడిమ్యాల మండల కార్యదర్శి బూట్ల రాజమల్లయ్య మాట్లాడుతూ... సుమారు 200 మంది క్రీడాకారులు కోకో,కబడ్డీ క్రీడాంశాల్లో పాల్గొన్నరని, క్రీడలు కురిసిన వర్షం వల్ల వాయిదా వేయబడ్డాయని, సోమవారం తిరిగి నిర్వహించబడతాయని ఆయన వెల్లడించారు. 20వ తేదీ ఆదివారం నిర్వహించబోయే అండర్ 14,అండర్ 17 బాలబాలికల వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొడిమ్యాల ఉప సర్పంచ్ గుర్రంనర్సయ్య, క్రీడాకారులు రాపర్తి లక్ష్మణ్, అనిల్,జిల్లా మాజీ ఎస్జీఎఫ్ కార్యదర్శి లక్ష్మీ రామ్ నాయక్, ఫిజికల్ డైరెక్టర్లు బీరయ్య, శివకృష్ణ, అనుపమ్ రెడ్డి,గంగాజల, అఖిల,హేమ, ప్రదీప్,పీఆర్టీయూ మండల కార్యదర్శి రాజు,భాస్కర్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.