మహాదేవపూర్ లో మంత్రి పర్యటన..
02-10-2026 | 05:32pm
మహాదేవపూర్/కాళేశ్వరం అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహాదేవపూర్ మండలంలో శనివారం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు మహాదేవపూర్ లో నూతనంగా నిర్మించిన అగ్నిమాపకం కార్యాలయం (ఫైర్ స్టేషన్), 10-30కు 65 లక్షలతో నిర్మించిన నూతన తాసిల్దార్ (ఎమ్మార్వో) కార్యాలయం ప్రారంభోత్సవం చేయనున్నారు.