రోటర్ డ్యామ్ స్కూల్‌లో రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు
ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం డివిజన్ నారపల్లి సమీపంలోని రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్(Rotterdam International School)లో 5వ రాష్ట్రస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో వివిధ పాఠశాలల నుండి అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్(State Rope Skipping Association) అధ్యక్షులు జక్కా వెంకటరెడ్డి ప్రారంభించారు. విద్యార్థులు(Students) పోటాపోటీగా ఆడి తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీలలో రోటర్ డామ్ విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి తమ ప్రతిభను చాటుకున్నారు. అలాగే దేవేంద్ర విద్యాలయ విద్యార్థులు ద్వితీయ స్థానంలో, కె.వి.2 ఉప్పల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు.
ఈ పోటీలలో రోటర్ డామ్ విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ గెలుచుకోవడం హర్షణీయం. తెలంగాణ రోప్ స్కిప్పింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కరుణాకర్ రెడ్డి, రోటర్ డామ్ స్కూల్ డైరెక్టర్ శ్వేతా రెడ్డి, ప్రిన్సిపాల్ రూప రెడ్డి, కె.వి స్కూల్ ప్రిన్సిపాల్ ఈవి. రమణ, స్పోర్ట్స్ ఇంచార్జి సూర్య ప్రకాష్, తెలంగాణ రోప్ స్కిప్పింగ్ జనరల్ సెక్రటరీ భాను ప్రకాష్ నాయర్ పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో గెలుపొందిన విజేతలకు పతకాలు, మెడల్స్ కె.వి స్కూల్ ప్రిన్సిపాల్ రమణ, రోటర్ డామ్ ప్రిన్సిపాల్ రూపరెడ్డి అందజేశారు.