డిజెలు పెడితే కఠిన చర్యలు
13-09-2026 | 12:59pm
అశ్వారావుపేట, (విజయ క్రాంతి): గణేష్ ఉత్సవాల్లో డి జె లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని అశ్వారావుపేట సర్కిల్ ఇన్సిపెక్టర్ నాగరాజు(Inspector Nagaraju) , ఎస్ ఐ యయాతి రాజు తో కలసి డిజె నిర్వాహకులను హెచ్చరించారు. ఆదివారం సర్కిల్ కార్యాలయం లో డి జె నిర్వాహకుల తో సమావేశం నిర్వహించారు. ఉత్సవాల్లో డి జె కు అనుమతి లేదని, ఎవ్వరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డి జె నిర్వాహకులను బైండోవర్ చేస్తున్నట్టు సి ఐ తెలిపారు.