ప్రమాదమని తెలిసినా.. ఫుట్‌బోర్డు ప్రయాణం!
- పట్టించుకోని ఆర్టీసీ అధికారులు..
- ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు
నంగునూరు, అక్టోబర్ 5 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు(Students') బస్సు ప్రయాణం(Bus journey) నిత్యం నరకప్రాయంగా మారుతోంది. ఫుట్‌బోర్డు ప్రయాణం అత్యంత ప్రమాదకరమని తెలిసినా,తప్పనిసరి పరిస్థితుల్లో విద్యార్థులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. నంగునూరు మండలం అక్కెనపల్లి మోడల్ స్కూల్(Akkenapalli Model School) కు వచ్చే ఆయా గ్రామాల విద్యార్థులకు సరైన రవాణా బస్సు సౌకర్యం లేకపోవడంతో వారు పడుతున్న ఇక్కట్లు తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతున్నాయి.
లెక్కకు మించి ప్రయాణికులు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఉన్న నేపథ్యంలో.. బస్సులు సరిపడా రాకపోవడంతో,ఉన్న ఒక్క బస్సులోనూ మహిళలు కిక్కిరిసిపోతున్నారు.దీంతో విద్యార్థులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫుట్‌బోర్డులపై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. కేవలం 50 నుంచి 60 మంది మాత్రమే ప్రయాణించే సామర్థ్యం ఉన్న బస్సులో, నిత్యం 100 మందికి పైగా ప్రయాణిస్తున్నారు.ఇరుకైన ప్రదేశాలలో, మెట్లపై వేలాడుతూ వెళ్తున్న ఈ ప్రయాణం ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుందోనని తల్లిదండ్రులు నిత్యం ఆందోళన చెందుతున్నారు.
సమయానికి రాక.. పాఠాలు కోల్పోతున్న వైనం..
అక్కెనపల్లి మోడల్ స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరైన సమయానికి బస్సులు రాకపోవడంతో పాఠశాలకు ఆలస్యంగా చేరుకుని తరగతులు, విలువైన పాఠాలను కోల్పోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇలాగే కొనసాగితే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని వాపోతున్నారు.కొండంరాజుపల్లి,ఖాతా,ఘనపూర్,ధర్మారం తదితరుల గ్రామాల విద్యార్థులకు పాఠశాలకు,ఇంటికి వెళ్లడానికి ఫుట్ పాత్ పై ప్రయాణం చేయాల్సివస్తుంది.
పదుల సార్లు ఫిర్యాదులు చేశాం..
పాఠశాలకు మరో రెండు ఆర్టీసీ బస్సు సౌ కర్యం కల్పించాలని, వి ద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని కోరుతూ స్కూల్ ప్రారంభం నుం చి ఇప్పటివరకు పదు ల సార్లు సిద్దిపేట ఆ ర్టీసీ అధికారులకు వినతిపత్రాలు సమరపిం చం. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. సరైన రవాణా సౌకర్యం, బస్సుల కొ రత కారణంగా రవాణా సౌకర్యం, బస్సుల కొరత కారణంగా రవాణా ఇబ్బందులు త ట్టుకోలేక ఇప్పటివరకు సుమారు 30 మం దికి పైగా విద్యార్థులు తమ టీసీలు తీసుకుని వేరే పాఠశాలలకు వెళ్లిపోయారు.
ప్రిన్సిపాల్ మంద జానయ్య
బస్సు లేక రోజూ పడిగాపులు కాస్తున్నాం!
మా ఊరు రాంపూర్ నుంచి మోడల్ స్కూల్ కు వెళ్ళే బస్సులు పూర్తిగా బందయ్యాయి. ఉదయం పూట బస్సు లేక విద్యార్థులు 6:30 గంటలకే రాంపూర్ స్టేజ్ వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది.ఉదయమే పోవడం వల్ల పిల్లలు తినడం లేదు.. దీని వల్ల అనారోగ్యం చెందుతున్నారు. సాయంత్రం ఇంటికి చేరేసరికి చీకటి పడుతోంది. బస్సు లేక కొన్నిసార్లు పిల్లలు బడికే వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాంపూర్ మీదుగా బస్సు నడిపించి మా పిల్లల చదువును కాపాడాలి.
గంగాధర్,రాంపూర్