పర్యాటక ప్రదేశాలను విద్యార్థులు గుర్తించాలి

22-09-2026 | 08:33pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్ 22(విజయ క్రాంతి): జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను విద్యార్థులు గుర్తించి, వాటి చరిత్ర, ప్రత్యేకతలు, ప్రకృతి అందాలు, సాంస్కృతిక విశిష్టతపై సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ కె. హారిత(Collector K. Haritha) సూచించారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి చిత్రలేఖనం, నృత్య పోటీల్లో ఆమె మాట్లాడారు. జిల్లాలో మరుగునపడిన పర్యాటక ప్రదేశాలను వెలుగులోకి తీసుకురావడంలో విద్యార్థుల భాగస్వామ్యం కీలకమని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మార్మట్, డిప్యూటీ కలెక్టర్ జె. జేసినాథ్ జోయెల్, జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు