స్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా నిత్య పూజలు
- వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం...
- స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ మహదేవన్ .......
యాదగిరిగుట్ట, అక్టోబర్ 2 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానంలో(Yadagirigutta Sri Lakshmi Narasimha Swamy Temple) శుక్రవారం నిత్య పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో ఉదయం సుప్రభాత సేవతో గర్భగుడిలో కొలువు దీరిన స్వయంభులను సువర్ణ ప్రతిష్ట మూర్తులను వేదమంత్రోచరణలు, మంగళ వాయిద్యాల నడుమ పంచామృతాలతో అభిషేకించి తులసీదళాలతో అర్పించారు. ప్రాకారమంటపంలో నృసింహ హోమం, నిత్య కళ్యాణంను వైభవంగా నిర్వహించారు.
సాయంత్రం వెండి జోడు సేవ స్వామివారు తిరువీధులలో ఊరేగారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో స్వయంభు లింగం, స్పటిక లింగంకు భక్తులు దర్శించుకున్నారు.... ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సుప్రీంకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ దర్శించుకున్నారు.
స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జి ఆర్ మహదేవన్ కు అతిధి గృహం వద్ద జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి , ఎస్పీ ఆకాంక్ష యాదవ్, ఈవో భవాని శంకర్ స్వాగతం పలికారు. ఆయనకు ఆలయ సంప్రదాయ ప్రకారం స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. దర్శనానంతరం వేదమండపంలో వేద ఆశీర్వచనం నిర్వహించి అనంతరం స్వామివారి లడ్డు ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.