ఎర్రవల్లి భూముల్లో సర్వే

18-09-2026 | 05:25am
  1. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో క్షేత్రస్థాయి పరిశీలన
  2. 388 ఎకరాలపై పాత రికార్డులు తిరిగేస్తున్న అధికారులు
  3. ఫామ్‌హౌస్‌కు వెళ్లిన అధికారులను అడ్డుకున్న దళిత రైతులు!

గజ్వేల్, సెప్టెంబర్ 17: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ (Former CM KCR's farmhouse) సమీపంలోని సర్వే నంబర్ 325 లోని 388 ఎకరాల ప్రభుత్వ భూముల సర్వే( Government Land Survey) కోసం రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలోకి దిగింది. 325లోని సర్వే నంబర్ పరిధిలోని భూముల రికార్డులు, హద్దులు, సాగు పరిస్థితులు, యాజమా న్య వివరాలపై అధికారులు సమగ్రంగా ఆరా తీస్తున్నారు.

శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ భూములపై చేసిన ఆరోపణల నేపథ్యం లో ఈ పరిశీలనకు ప్రాధాన్యం ఏర్ప డింది. సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ, మర్కుక్ తహసీల్దార్ సరిత, సర్వేయర్లు, ఇతర రెవెన్యూ సిబ్బంది గురువారం సర్వేనంబర్ 325లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. భూముల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు రికార్డుల్లోని వి వరాలు, క్షేత్రస్థాయి హద్దులను పరిశీలిస్తూ అధికారులు వివరాలు సేకరించారు.

ప్రస్తుతం 388 ఎకరాల భూమిలో ఎర్రవల్లి గ్రామానికి చెందిన వివిధ వర్గాల ప్రజలు వ్యవసా యం చేస్తున్నట్లు స్థానికులు చెపుతున్నారు. ఈ నేపథ్యంలో భూమి ఎవరి ఆధీనంలో ఉ ంది, ప్రస్తుతం ఎలాంటి వినియోగంలో ఉం ది, రికార్డుల్లో ఉన్న వివరాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎంతవరకు పొంతన ఉందనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు. గతంలో సర్వే నంబర్ 325ను ‘రెడ్ మార్క్’లో చేర్చినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నా రు.

దీంతో పాత రెవెన్యూ రికార్డులను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. శాసనసభలో ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు సంబంధించిన భూములపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సంబంధిత భూములపై క్షేత్రస్థాయి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

ఈ మేరకు అధికారులు చేపట్టిన పరిశీలన అనంతరం భూముల రికార్డులు, హద్దులు, సాగు పరిస్థితులు, యాజమాన్య వివరాలను క్రోడీకరించి ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఉన్నట్లు రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అధికారులను అడ్డుకున్న దళిత రైతులు!

కేసీఆర్ ఫామ్‌హౌసును సర్వే చేయడానికి వచ్చిన రెవెన్యూ అధికారులను ఎస్సీ రైతులు అడ్డుకోవడంతో అక్కడ తీవ్ర వాగ్వాదం, గందరగోళం చెలరేగింది. ఏళ్లుగా తాము అసైన్డ్ భూముల్లోనే పంటలు పండిస్తున్నామని రైతులు స్పష్టం చేశారు. ఉన్నట్టుండి ఇప్పుడెందుకు సర్వే చేస్తున్నారంటూ అధికారులను నిలదీశారు. సర్వే చేసి ఆ భూములను ఏం చేస్తారని ప్రశ్నించారు. ఒకవేళ తమ భూములు లాక్కునే ఆలోచన చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ రెవెన్యూ అధికారులకు రైతులు మాస్ వార్నింగ్ ఇచ్చారు.


 

మరిన్ని వార్తలు