గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛత కార్యక్రమం
పెంచికలపేట (విజయక్రాంతి): మండల కేంద్రములోని ఎల్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని వారసంతలో గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం(Swachh Bharat Drive)లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ భక్తు రాంచందర్ స్వయంగా గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి వారసంతలోని శౌచాలయం (లాట్రిన్, బాత్రూమ్)ను శుభ్రం చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్త, పిచ్చి మొక్కలను తొలగించి పరిశుభ్రం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ భక్తు రాంచందర్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాల్లో స్వచ్ఛతకు ప్రత్యేక స్థానం ఉందని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ గ్రామ పంచాయతీ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు చర్యలు చేపట్టారు.