సీఐడీ విచారణపై స్పష్టత కోరిన టీసీఏ
హైదరాబాద్, సెప్టెంబర్ 30: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association)లో, ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన ‘టీజీ20’ ఈవెంట్‌కు సంబంధించిన ఆర్థిక అవకతవకలపై జరుగుతున్న విచారణ స్థితిగతులపై డీజీపీ వెంటనే స్పష్టతనివ్వాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(Telangana Cricket Association) కోరింది.
రాష్ట్ర లోకాయుక్త ముందు సీఐ డీ ఒక సంక్షిప్త నివేదికను సమర్పించిందని, కోర్టు నియమిం చిన ఏకసభ్య కమిటీ (ఎస్‌ఎంసీ) క్రిమినల్ విచారణ విషయాలలో తన అధికారాలను ఏ మేరకు వినియోగిస్తోందనే దానిపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని టీసీఏ జనరల్ సెక్రటరీ ధరం గురువారెడ్డి(Dharam Guruva Reddy) తెలిపారు.
సెప్టెంబర్ 29 నాటికి వివరమైనని వేదికను కోరగా, లోకాయుక్త విచారణకు సమాధానంగా సీఐడీ ఈ నివేదికను సమర్పించింది. ఎస్‌ఎంసీ తీసుకున్న వైఖరి కారణంగా, టీజీ20 ఈవెంట్‌తో ముడిపడి ఉన్న వి షయాలతో సహా హెచ్‌సీఏ ఆర్థిక అవకత వకలకు సంబంధించిన కొన్ని అంశాలపై దర్యాప్తును ముందుకు తీసుకెళ్లలేకపోయినట్లు సీఐడీ పేర్కొంది. కోర్టు నియమించిన పరిపాలనా యంత్రాంగం, చట్టబద్ధమైన దర్యాప్తు సంస్థ విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవచ్చా లేదా జాప్యం చేయొచ్చా అని గురువారెడ్డి ప్రశ్నించారు. ఏ విచారణ ఫలితాన్ని ముందే ఊహించి మాట్లాడుతున్నామని కాకుండా, సమర్థ అధికారుల నుంచి స్పష్టత మాత్రమే కోరుతున్నామన్నారు.