సభ్యత్వం కోసం టీసీఏ న్యాయపోరాటం
హైదరాబాద్, సెప్టెంబర్ 12 : తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (Telangana Cricket Association) తన దీర్ఘకాలిక పూర్తి స భ్యత్వం డిమాండ్‌ను బలంగా ముందుకు తీ సుకెళ్లేందుకు కీలకమైన న్యాయపరమైన వ్యూహాన్ని అమలు చేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) తెలంగాణలో రాష్ట్రవ్యాప్త, సమగ్ర క్రికెట్ అభివృద్ధికి అ డ్డంకిగా కొనసాగుతోందని టీసీఏ ఆరోపించింది. టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గు రువారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ క్రికెట్ పరిపాలనలో ప్రాథ మిక నిర్మాణాత్మక అసమానత కొనసాగుతోందన్నారు.
ఒక నగర-కేంద్రీకృత సం ఘం రాష్ట్ర సభ్యత్వంపై ఆధిపత్యం కొనసాగిస్తుండగా, 32 జిల్లాల్లోని వేలాది ప్రతిభా వంతులైన యువ క్రికెటర్లకు సమానమైన రాష్ట్రవ్యాప్త క్రికెట్ వ్యవస్థ అందుబాటులో లేకపోవడం తెలంగాణ క్రికెట్‌కు మూల సమస్యగా అభివర్ణించారు. టీసీఏ తన ఫుల్ మెంబర్‌షిప్ డిమాండ్‌ను నేరుగా బాంబే హైకోర్టు ముందు ఉంచడంతో పాటు బీసీసీఐ అంబుడ్స్ మన్ ముందు సమగ్ర ప్రాతినిధ్యం సమర్పించింది.
సుప్రీం కోర్టు, లోధా కమిటీ సిఫారసు ల ఆధారంగా రూపొందిన సంస్కరించిన బీసీసీఐ రాజ్యాంగాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణలో ప్రస్తుత వ్యవస్థను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని టీసీఏ తెలిపింది. వన్ స్టేట్ - వన్ ఫుల్ మెంబర్ సూత్రాన్ని కేవలం సభ్యత్వ ప్రశ్నగా కాకుండా ఇతర అంశాలతో అనుసంధానించి చూడాలని కోరుతోంది. ఇదిలా ఉంటే హెచ్ సీఏ యొ క్క ఆర్థిక, పరిపాలన రికార్డుపై ఇప్పటికే పలు సందర్భాల్లో ప్రశ్నలు తలెత్తాయని టీసీఏ పేర్కొంది.