విద్యార్థినులకు సైకిల్ పంపిణీ
19-09-2026 | 01:22pm
ధర్మపురి,సెప్టెంబర్19 (విజయక్రాంతి): బుగ్గారం మండలం, సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(v)కు చెందిన గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు వి. రత్నాకర్ శనివారం ఇద్దరు విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ(Bicycle distribution) చేశారు. పాఠశాలకు దూరం నుండి వస్తున్నారని గ్రహించి తన సొంత డబ్బులతో ఇద్దరు విద్యార్థినిలకు రూ. 10 వేల విలువ గల సైకిళ్లను గ్రామ సర్పంచ్ ధర్మరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ విజయ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, పాలకమండలి సభ్యులు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. కాగా తన సొంత డబ్బులు సైకిల్లు అందజేసిన ఉపాధ్యాయుడు రత్నాకర్ ని సర్పంచ్ , ఉపసర్పంచ్, పాలక మండలి సభ్యులు అభినందించారు.