కలెక్టర్చే ప్రశంసా పత్రాన్ని అందుకున్న ఉపాధ్యాయుడు
ముకరంపుర, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో విశిష్ట సేవలు అందిస్తూ, వినూత్న బోధనతో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పెంచినందుకు మందల లక్ష్మీనారాయణకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసా పత్రం లభించింది. శనివారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ హర్ష చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు.
రామగుండం(Ramagundam)లోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్(English School Assistant)గా మందల లక్ష్మీనారాయణ విధులు నిర్వహిస్తున్నారు. వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల అభ్యసన ఫలితాలను మెరుగుపర్చేందుకు ఆయన కృషి చేశారు. అలాగే పాఠశాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తూ, ప్రభుత్వ విద్యా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంలో కృషి చేశారు. దీంతో ఆయనకు ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. మాట్లాడారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.






