6 September, 2026 | 8:24 AM

ప్రపంచ శాంతిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

06-09-2026 | 05:15am

రెపోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ కృష్ణయ్య

ముషీరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ, మానవతా దృక్పథాన్ని పెంపొందించి, హింస, నేర ప్రవృత్తికి దూరంగా ఉంచడంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించాలని, ప్రపంచశాంతిలో వారి పాత్ర కీలకమని జాతీయ బీసీ సంక్షేమ సంఘం (National BC Welfare Association) అధ్యక్షుడు, ఎంపీ ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నేడు (ఆదివారం) రవీంద్రభారతిలో నిర్వహించనున్న ప్రపంచశాంతి ఉపాధ్యాయుల పాత్ర సదస్సు పోస్టర్‌ను విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో కృష్ణయ్య శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణయ్య మాట్లాడుతూ.. సమాజశ్రేయస్సులో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.

నవభారత్ నిర్మాణ సంఘం అధ్యక్షులు ఎస్. రవికుమార్ మాట్లాడుతూ.. ప్రతి వ్యక్తిలో శాంతి, పరస్పర గౌరవం, మానవత్వం పెంపొందినప్పుడే నిజమైన ప్రపంచశాంతి సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సునీల్ కుమార్, హెచ్‌డబ్ల్యూపీఎల్ రీజినల్ మేనేజర్ వెంకట్ మాతంగి, వేణుగోపాల్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు