7 August, 2026 | 4:43 PM

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

07-08-2026 03:56 PM

వాంకిడి,(విజయక్రాంతి): పీఆర్‌సీని వెంటనే అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం వాంకిడి జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండో పీఆర్‌సీని తక్షణమే అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నటరాజ్‌తో పాటు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినీలు తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు.